తెలంగాణపై ప్రధాని ప్రకటన మీద కేశవరావు గుర్రు

తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటులో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తే ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడుతామని మరో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల్లో చీలికలు లేవని చెప్పారు. సకల జనుల సమ్మె, ఆత్మబలిదానాలు చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడం సరి కాదని కె. కేశవరావు అన్నారు. తెలంగాణపై ప్రధాని ప్రకటనను ఖండిస్తున్నట్లు మరో పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు.












Click it and Unblock the Notifications