పరకాల విజ్ఞుడన్న తెలంగాణ నేతలు,టీవీలో చర్చ

టిఆర్ఎస్ నేత నాయిని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించడం విశేషం. పరకాల విజ్ఞులని, ఆయన చాలా చక్కగా మాట్లాడతారని చెప్పారు. రేవంత్ చెప్పినట్లుగా ఆయన తన చతురతతో మార్చగలరని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో దాడిని నాయిని కూడా ఖండించారు. దాడి ఘటనకు తమ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా క్షమాపణలు చెప్పారన్నారు. పరకాల తెలివైన వారని తాము ఒప్పుకుంటున్నామని అయితే ఆయన వెనుక సమైక్యవాదుల కుట్ర ఉందని ఆరోపించారు. పరకాల మాట్లాడుతూ విభజన కోరుకునే వారు, విభజనను వ్యతిరేకించే వారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఉన్నారని చెప్పారు. కాగా ఆదివారం పరకాల ప్రభాకర్ పైన తెలంగాణవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications