చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన బొత్స సత్యనారాయణ

తన వాదన వినకుండా హైకోర్టు తన ఆస్తులపై విచారణకు ఆదేశించడం సరి కాదని చంద్రబాబు అన్నారని, చంద్రబాబు చెప్పినట్లు కోర్టు చేయాలా అని ఆయన అన్నారు. తాను నీతిమంతుడినని చెప్పుకునే చంద్రబాబు ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని అలవాటు చేసుకున్నారని, అలా నీతిమంతుడైతే హైకోర్టు తనకు నోటీసు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసిందని ఎందుకు అంటున్నారని ఆయన అన్నారు. విచారణ చేసుకోవచ్చునని చంద్రబాబు సూటిగా మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. దోపిడీ దొంగతనం చంద్రబాబుకే అలవాటు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications