చిక్కుల్లో చంద్రబాబు, వైయస్ జగన్‌పై దాడికి బ్రేక్‌లు

Chandrababu Naidu
హైదరాబాద్: తన ఆస్తులపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేసిందనే చెప్పాలి. సిబిఐ విచారణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న చంద్రబాబు దాడికి దాంతో బ్రేకులు పడినట్లే. సిబిఐ విచారణతో వైయస్ జగన్ జైలుకు పోవడం ఖాయమంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు తెగ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పరిస్థితి ఎదుర్కునే పరిస్థితి రావడంతో వారి నోళ్లకు తాళాలు పడినట్లేనని భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కొత్త విషయాలేమీ లేవని, అందువల్ల ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం నాయకులు భావిస్తూ వచ్చారు. చంద్రబాబు ఆస్తులపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించడంతో తెలుగుదేశం నాయకులు బిత్తరపోయారనే చెప్పాలి.

హైకోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత తెలుగుదేశం నాయకులు చాలా మంది వెంటనే ఎలా స్పందించాలో అర్థం కాక మిన్నకుండిపోయారు. ఆ తర్వాత మెల్లగా గొంతు విప్పి, తమ నాయకుడు నిర్దోషిగా బయటకు వస్తారని చెబుతూ వచ్చారు. ఆ విషయం అలా ఉంటే, రాజకీయంగా మాత్రం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ నే తగిలిందని చెప్పవచ్చు. సిబిఐ విచారణను అసరా చేసుకుని రాజకీయంగా వైయస్ జగన్‌ను దెబ్బ తీయాలనే చంద్రబాబు వ్యూహం ఫలించే సూచనలు కనిపించడం లేదు. జగన్ అవినీతిపై ఆరోపణలు చేసే స్థితి కూడా లేకుండా పోయింది. జగన్ అవినీతి గురించి మాట్లాడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చంద్రబాబుపై హైకోర్టు విచారణకు ఆదేశించిన విషయాన్ని ఆసరా చేసుకుని విరుచుకుపడే అవకాశం ఉంది.

తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న వైయస్ జగన్‌కు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు హైకోర్టు ఆదేశాలు కొంత మేరకు ఊరటనిచ్చినట్లే చెప్పాలి. విచారణల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి రాజకీయంగా చంద్రబాబు చేస్తున్న దాడి నుంచి వారు బయటపడ్డారు. చంద్రబాబు నుంచి గానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి గానీ సిబిఐ విచారణను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా చేసే వ్యాఖ్యల నుంచి మాత్రం రక్షణ లభించినట్లు చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+