కోనేరు ప్రసాద్‌కు షరతులతో తాత్కాలిక బెయిల్

కోనేరు ప్రసాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై 20 నుంచి 25 నిమిషాల పాటు వాదోపవాదాలు జరిగాయి. సిబిఐ కూడా శబరిమల వెళ్లడానికి కోనేరు ప్రసాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను పెద్దగా వ్యతిరేకించలేదు. తాను 1984నుంచి అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని, ఈసారి కూడా తాను శబరిమల వెళ్లాలని అంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోనేరు ప్రసాద్ కోర్టును కోరారు. శబరిమల వెళ్లడానికి కోనేరు ప్రసాద్ రేపు బుధవారం విడుదలవుతారు. ఆయన ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications