నాలుగు రాష్ట్రాలుగా యుపి విభజన: మాయావతి

Mayawati
లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించే ప్రతిపాదనను నవంబర్ 21వ తేదీ నుంచి జరిగే శాసనసభ శీతాకాలం సమావేశాల్లో పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి మాయావతి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ను పూర్వాంచల్ (తూర్పు యుపి), పశ్చిమాంచల్ (పశ్చిమ యుపి), బుందేల్‌ఖండ్, అవధ్ (మధ్య యుపి) రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆదే విషయాన్ని ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.

వచ్చే శానససభ ఎన్నికల్లో తన ప్రతిపాదన విజయాన్ని అందిస్తుందని మాయావతి నమ్ముతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి, తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆమె ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మాయావతి ప్రతిపాదనను రాజకీయ క్రీడగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విస్తృతమైన చర్చల తర్వాత, అనుకూల ప్రతికూల అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రాన్ని విభజించాలనే ప్రతిపాదనను అంగీకరించినట్లు మాయావతి తెలిపారు. పెద్ద రాష్ట్రాల్లో కన్నా చిన్న రాష్ట్రాల్లో వ్యవహారాలు నడపడం సులభమవుతుందని ఆమె అన్నారు. పెద్ద రాష్ట్రం కావడం వల్లనే యుపి వెనకబడిపోయిందని ఆమె అన్నారు.

దేశానికి యుపి ఎక్కువ మంది ప్రధానులను అందించినప్పటికీ వారెవరూ రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టలేదని ఆమె విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం విభజన, పునర్వ్యస్థీకరణ, రాష్ట్రాల పేర్లను పార్లమెంటు నిర్ధారిస్తుందని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+