రెండో ఎస్సార్సీ మంచిది: తెలంగాణపై మంత్రి పురంధేశ్వరి

తెలంగాణపై తీసుకునే నిర్ణయం తప్పకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని, దేశంలో అనేక రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఉన్నాయని, కాబట్టి దీనిపై సమగ్గరంగా ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. దేశశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రధాని తెలంగాణపై ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారని ఆమె అన్నారు. గులాం నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ మాటలను బట్టి తెలంగాణపై త్వరలో నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని, వారు తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిన అవసరం, బాధ్యత ఉందని ఆమె అన్నారు. జనవరి లోపు తెలంగాణపై నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణపై నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications