తెలంగాణ ఎంపిల రాజీనామాల తిరస్కరణ

తెలంగాణపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాజీనామాలపై తొందరపడవద్దని స్పీకర్ గతంలో ఓసారి కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులకు సూచించారు. తాము పార్లమెంటుకు వెళ్లి తెలంగాణ కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. పార్లమెంటు వేదిక తెలంగాణవాణి వినిపిస్తామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. అవసరమైతే మళ్లీ రాజీనామాలు చేస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇదిలావుంటే, తెలంగాణలోని ఆత్మహత్యలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 14వ తేదీకి వాయిదా పడింది. తెలంగాణలోని ఆత్మహత్యలకు సోనియా గాంధీదే బాధ్యత అంటూ న్యాయవాది పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications