కిరణ్‌తో జగన్ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే భేటీ

గత ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి పట్టుబట్టి వైయస్ జగన్మోహన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేత టికెట్ ఇప్పించారని అంటారు. కాకినాడ అర్బన్‌లో ప్రాబల్యం ఉన్న ముత్తా గోపాలకృష్ణను కాదని వైయస్ రాజశేఖర రెడ్డికి టికెట్ ఇప్పించారు. దాంతో ముత్తా గోపాలకృష్ణ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగినా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గెలిచారు. కాంగ్రెసు నుంచి బయటపడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో జగన్ వెంట ఉండే ముఖ్యమైన శాసనసభ్యుల్లో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఒక్కరని భావించారు. కానీ, ద్వారంపూడి క్రమంగా జగన్‌కు దూరమవుతూ వస్తున్నట్లు చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications