కెవిపికి చుట్టుకుంటున్న ఎమ్మార్ స్కామ్ గొడవ

ఎమ్మార్ చైర్మన్ అలబ్బర్, స్టైలిష్ హోమ్స్ మేనేజింగి డైరెక్టర్ కోనేరు ప్రసాద్‌లు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, అప్పటి ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్ర రావులతో జరిపిన సమావేశంలోనే హైదరాబాదు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఎపిఐఐసి వాటను 49 శాతం నుంచి 26 శాతానికి తగ్గిస్తూ ఎమ్మార్ వాటాను 51 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ నిర్ణయం జరిగిందని జగన్నాథన్ సిబిఐకి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత అలబ్బర్ వైయస్ రాజశేఖర రెడ్డిని విడిగా కలిసినట్లు జగన్నాథన్ సిబిఐకి చెప్పాడు.
కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో మంగళవారం పెన్నా సిమెంట్స్ ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు. పెన్నా సిమెంట్స్ వైయస్ జగన్‌కు చెందిన వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. దానికి ప్రతిఫలంగానే పెన్నా సిమెంట్స్‌కు సున్నపురాయి గనులను లీజుకు ఇచ్చారా అనే విషయంపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అరబిందో కంపెనీ ప్రతినిధులు కూడా మంగళవారం సిబిఐ ముందు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications