వైయస్ జగన్ పార్టీకే భవిష్యత్తు ఉంటుంది: సబ్బం హరి

Sabbam Hari
విశాఖపట్నం/హైదరాబాద్: రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెసు మాత్రమేనని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. తాను లోకసభకు ఎన్నికై ఢిల్లీకి వెళ్లిన తర్వాతనే కాంగ్రెసు అసలు స్వరూపం తెలిసిందని ఆయన బుధవారం విశాఖపట్నంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఉండి ఉంటే కాంగ్రెసు మంత్రిగా ఉండిపోయేవాడినని ఆయన అన్నారు. ఇప్పుడున్న మంత్రులు, శాసనసభ్యులు మాజీలుగా మిగిలిపోక తప్పదని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అవినీతి బురదలో కూరుకుపోయి ఉన్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. చంద్రబాబుకు మరొకరు బురద పూయాల్సిన అవసరం లేదని ఆయన హైదరాైబాదులో మీడియా ప్రతినిధల సమావేశంలో అన్నారు. కోర్టుకు, కేంద్రానికి చంద్రబాబు లింక్ పెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎల్లో మీడియా వైయస్ రాజశేఖర రెడ్డిపై తప్పుడు రాతలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. ఈనాడు అధిపతి రామోజీరావుకు శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో వందలాది ఎకరాల భూమి ఉందా, లేదా అని ఆయన అడిగారు.

దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ వచ్చే శాసనసభా సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆయన సవాల్ చేశారు. ఇద్దరం కలిసి ఈ ప్రభుత్వాన్ని దింపుదామని ఆయన తెలుగుదేశం పార్టీకి పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో పార్టీ మరో అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+