వైయస్ జగన్ కార్యకర్తలపై బొత్సకు కోపమొచ్చిన వేళ

అనంతపురం జిల్లా సికెపల్లి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రఘువీరా రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురయింది. ఇందిరమ్మ గృహాల పంపీణీ తదితర ప్రభుత్వ పథకాలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంత్రిని నిలదీశారు. టిడిపి వారిని కాంగ్రెసు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింప జేశారు.
మరోవైపు హైదరాబాదులో రాజేంద్ర నగర్‌లోని సిసి రోడ్డు ప్రారంభోత్సవంలో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అనుచరులు మంత్రికి అనుకూలంగా నినాదాలు చేయడంతో స్థానిక టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు అనుకూలంగా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలై బాహాబాహీ స్థాయికి చేరుకుంది. పోలీసుల జోక్యం చేసుకొని ఇరువర్గాలను సమాధానపరిచారు.












Click it and Unblock the Notifications