హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుప్రీంకోర్టుకు చంద్రబాబు: జగన్ సాక్షి రివర్స్ అటాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Sakshi
హైదరాబాద్: సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లే అంశంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక రివర్స్ అటాక్‌కు దిగింది. తన ఆస్తులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడంతో చంద్రబాబు బుధవారం పార్టీ సీనియర్లతో సమావేశమైన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లాలని చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేకున్నప్పటికీ సీనియర్ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం పార్టీ సీనియర్లు కూడా మీడియా సమావేశంలో అదే చెప్పారు. అయితే జగన్‌కు చెందిన సాక్షి మాత్రం బాబుపైనే అటాక్ చేసింది.

చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే పార్టీలోని వ్యాపారవేత్తలు హైకోర్టు తీర్పుపై తక్షణం సుప్రీంలో సవాల్ చేయాలని సమావేశంలో కోరారని, అయితే పార్టీ నేతల వాదన మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలిస్తోందని చెప్పింది. ఇప్పటివరకు జరిగిన అనేక విచారణల్లో నిర్దోషిగా బయటపడినట్లు చెప్పుకుంటున్నందున పూర్తిస్థాయి విచారణకు సిద్ధపడి క్లీన్ చిట్ తెచ్చుకోవాలని అలా అయితే పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందని పార్టీ కోటరీకి సంబంధం లేని నాయకులు గట్టిగా చెప్పారని, అయితే బాబు మాత్రం కోటరీ నాయకులు చెప్పిన దాన్ని సమర్థిస్తూ మన వాదన వినకుండా హైకోర్టు తీర్పు చెప్పిందని ఈ విషయంలో సూప్రీంను ఆశ్రయించాల్సిందేనని సీనియర్ నేతలతో బాబు అన్నట్టు పార్టీ వర్గాల తెలిసిందని చెప్పింది.

అంతేకాకుండా అనేక విషయాల్లో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తూ కాంగ్రెసు సర్కారును కాపాడుతుంటే ప్రభుత్వం మాత్రం మన మీద సిబిఐ విచారణ వేయడమేమిటని ఓ నేత మండిపడ్డారని చెప్పింది. అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనపై అనేక రకాలుగా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వెనకడుగు వేస్తూ సర్కారును కాపాడుతుంటే మనకు ఇదా ప్రతిఫలం సదరు నేత ఆవేదన చెందారని తెలిపింది. రాష్ట్రంలో సర్కారును కాపాడుతున్నందున ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు తీవ్రతరం చేయాలని, ఇందుకు రిలయన్స్ సంస్థ సహకారం తీసుకోవాలని, ఢిల్లీలో ఉన్న సంబంధాలతో వెంటనే బయటపడేటట్టు చేయాలని పార్టీకి చెందిన ఒక నేత, మరోవ్యాపారవేత్త బాబును కోరారని పేర్కొంది.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy's Sakshi reverse attacked on TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X