అది వైయస్ జగన్ వైఫల్యం కాదు: బొత్స సత్తిబాబు

తాము అధికారం కోసం అర్రులు చాచడం లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే హక్కు ఉందని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము ఎదుర్కుంటామని, తమకు తగిన సంఖ్యాబలం ఉందని ఆయన ఆన్నారు. అన్ని విషయాలపై శాసనసభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. శానససభా సమావేశాల తర్వాత తాను తెలంగాణలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. కర్నూలు, ఒంగోలుల్లో ఈ నెలలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలకు పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులను డిసెంబర్ 1వ తేదీన పిసిసి విచారించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications