మాజీ టెలికం మంత్రి సుఖ్‌రామ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

పివి నరసింహారావు ప్రభుత్వంలో టెలికం మంత్రిగా పనిచేసిన సుఖ్‌రామ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, 30 కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టును ప్రైవేట్ సంస్థ హర్యానా టెలికం కంపెనీకి ఇచ్చారని సిబిఐ అభియోగం మోపింది. ఈ కేసులో సుఖ్‌రామ్‌ను కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. శనివారం సుఖ్‌రామ్‌కు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.












Click it and Unblock the Notifications