వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరు ద్రోహులో తేలిపోతుంది: ఎర్రన్నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errannaidu
హైదరాబాద్: అవిశ్వాసంపై కొందరు నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై తాము వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని అప్పుడు ఎవరు దొంగలో ఎవరు ద్రోహులో తేలిపోతుందన్నారు. టిడిపి అవిశ్వాసం పెడితే ప్రభుత్వాన్ని పడగొడతామని బీరాలు పలిగిన వారు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దామన్నారు. గత సమావేశాలలోనే అవిశ్వాసం కోసం స్పీకర్‌కు నోటీసు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

జగన్ వర్గం నేతలు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయలేకే కాంగ్రెసులోకి వెళుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి అధికారులపైనా, మంత్రులపైనా పట్టు లేదన్నారు. రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు చెత్తకుండీలో వేస్తుంటే ఆ కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లోని వైఫల్యం మంత్రే అంగీకరించారన్నారు. రాష్ట్రంలో, దేశంలో అత్యధిక పన్నులు వేస్తున్న తొలి ముఖ్యమంత్రి కిరణే అన్నారు. ప్రచారం చేసుకోవడంలో కిరణ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మించి పోయారన్నారు.

English summary
TDP senior leader Errannaidu lashes out at YSRC Party president YS Jaganmohan Reddy camp mlas about no confidential vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X