వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతిది రాజకీయ విభజన: వెంకయ్య నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి మాయావతి సొంత ప్రయోజనాల కోసం ఉత్తరప్రదేశ్ విభజనను ప్రతిపాదించారని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు విమర్సించారు. ఉత్తరప్రదేశ్‌లో విభజన కోసం ఏ విధమైన ఉద్యమాలు లేవని, అలాంటి స్థితిలో మాయావతి ప్రతిపాదన రాజకీయ లబ్ధి కోసమేనని అర్థమవుతోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన జరుపుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఆయన తప్పు పట్టారు.

దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం అంశాలపై తామిచ్చిన నోటీసులపై చర్చించేందుకు యుపిఎ ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు. నల్లధనాన్ని విదేశాల్లో దాచుకున్నవారి పేర్లను ఎందుకు వెల్లడించడం లేదని ఆయన అడిగారు. రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐ పెట్టుబడులకు తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. దీనివల్ల చిరు వ్యాపారులు, సన్నకారు రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు సక్రమంగా జరగకపోవడానికి యుపిఎ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు.

English summary
BJP leader M Venkaiah Naidu has rubbished UP CM Mayawathi proposal of division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X