తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీకి వైయస్ జగన్ పార్టీ రెడీ

YSR Congress
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికి రెండు శాసనసభా స్థానాలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఖాళీ అయ్యాయి. నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా వల్ల నాగర్ కర్నూలు సీటు, రాజేశ్వర రెడ్డి మృతి వల్ల మహబూబ్‌నగర్ సీటు ఖాళీ అయ్యాయి. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఒకటి రెండు రోజుల్లో మరిన్ని రాజీనామాలను ఆమోదిస్తే మరిన్ని సీట్లు ఖాళీ అవుతాయి. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికకు దూరంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈసారి పోటీకి సిద్దపడాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల సమయంలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని జగన్ తెలంగాణ ప్రాంత నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు. పార్టీ క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి పోటీ చేయడమే మంచిదని తెలంగాణ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. బాన్సువాడ ఉప ఎన్నికలో మౌనంగా ఉండిపోవడానికి బదులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి పోచారం శ్రీనివాస రెడ్డికి ప్రచారం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏమైనా, ఉప ఎన్నికల్లో పోటీపై తెలంగాణ నాయకుల్లో విస్తృతమైన చర్చే జరుగతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+