అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి, తెరాస వాకౌట్

తెలంగాణపై మూడు పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అవిశ్వాసానికి మద్దతుగా 76 మంది శాసనసభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతించిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ తన శాసనసభ్యులకు విప్ జారీ చేసింది. అవిశ్వాసంపై ఓటింగు, తదితర అంశాలను సభా సంప్రదింపుల కమిటీ (బిఎసి) సమావేశంలో చర్చిద్దామని స్పీకర్ చెప్పారు. ఆ తర్వాత రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కరవు పరిస్థితిపై ప్రకటన చేశారు. ఈ సమయంలో మంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా తెరాస కాంగ్రెసుతో కుమ్మక్కయి తెరాస ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం విమర్శిస్తున్న నేపథ్యంలో తెరాస వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications