అవిశ్వాసంపై వైయస్ జగన్ తోక ముడిచారు: ఎర్రబెల్లి

కాగా, అవిశ్వాస తీర్మానంపై తెలుగుదేశం పార్టీకి స్పష్టత లేదని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వం పడిపోతుందని, అప్పుడు తెలంగాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీలు కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం పల్లనే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే తెలుగుదేశం, తెరాస సభ్యులు శానససభా సమావేశాలను అడ్డుకుంటున్నారని కాంగ్రెసు సభ్యులు కొండ్రు మురళి, జగ్గారెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications