చంద్రబాబు చెంతకు ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు?

తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. కాగా, బాలనాగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో ఆ ముగ్గురికి కూడా తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. ఆ ముగ్గురు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తే చంద్రబాబుకు నైతిక బలం చేకూరినట్లేనని చెప్పవచ్చు. అయితే, ఆ వార్తలను హరీశ్వర్ రెడ్డి ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పిలిచినా తాను కలవబోనని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగదేశం పార్టీ తన వైఖరిని స్పష్టం చేసేవరకు తాను కలవబోనని చెప్పారు.












Click it and Unblock the Notifications