సింగపూర్ హోటల్‌పై సవాల్, టిడిపి చరిత్ర తవ్విన బాబు

chandrababu naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో తన సింగపూర్ హోటల్ పైన సవాల్ విసిరారు. సింగపూర్‌లో తనకు హోటల్ ఉందని చెబుతున్న వారెవరైనా దానిని నిరూపిస్తే అది వారికే రాసిస్తానని సవాల్ విసిరారు. తనపై దివంగత సిఎం వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నో విచారణలు వేసి వేటినీ నిరూపించలేక పోయారని గుర్తు చేశారు. తాను ఎనిమిదేళ్లుగా అధికారంలో లేనని, రెండోసారి వరుసగా విపక్షంలో ఉంటున్నానని ఇన్నాళ్లు లేకుండా ఇప్పుడు మళ్లీ విచారణ చేపట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చిత్తూరు డైరీ తన హయాంలో మూసివేయబడలేదని కాంగ్రెసు హయాంలోనే కుప్పకూలిపోయిందని చెప్పారు. అలాంటప్పుడు హెరిటేజ్ డైరీతో చిత్తూరు డైరీ మూతబడిందని ఎలా అంటారన్నారు.

కాకనాడ పోర్టు విషయంలోనూ టిడిపి ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కాంగ్రెసు హయాంలోనే అవినీతి జరిగిందన్నారు. తనకు ఎవరినో బినామీగా చూపించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. జెమ్స్ అండ్ జ్యూవెల్లరీస్‌లోనూ రూల్స్ వారు రూల్సు మార్చి నామీద అపవాదు వేయడమేమిటన్నారు. దేశానికి మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌ను తీసుకు వచ్చిన ఘనత మాదేనన్నారు. కాంగ్రెసు నేతల తీరు చూస్తుంటే రేపు అసెంబ్లీ కూడా నాదే అని అంటారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మేం ఆస్తులు కాపాడితే కాంగ్రెసు ధారాదత్తం చేశారన్నారు. నన్ను అందరికీ బినామీ అంటున్నారని మిమ్మల్ని కూడా సోనియాకు బినామీ అంటే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.

ప్రజారాజ్యం రాకపోతే కాంగ్రెసు పార్టీ ఓడిపోయేదన్నారు. కాంగ్రెసు వల్లనే మాకు నష్టం జరిగిందన్నారు. మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తే మేం మరింత బలంగా తయారవుతామన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసమే ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి చరిత్రను కొద్దిగా తవ్వారు. తెలుగువాడు అనే సెంటిమెంటుతో ఎన్టీఆర్ పివి నర్సింహారావుపై పోటీ పెట్టకుంటే ఆ తర్వాత మా ప్రజాప్రతినిధులకే వారు ఎర వేశారన్నారు. ఇటీవల కూడా ఇద్దరు ఎంపీలను కాంగ్రెసు పార్టీ ప్రలోభాలకు గురి చేసిందని విమర్శించారు. ముప్పయ్యేళ్ల ప్రస్థానంలో టిడిపి ఎప్పుడూ ఎవరికీ భయపడలేదని రాజీపడలేదన్నారు. కొత్తగా ఎన్నో పార్టీలు పుట్టుకు వస్తున్నాయి పోతున్నాయి కానీ టిడిపి మాత్రం ఎప్పుడు ప్రజల కోసం పోరాటం చేస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+