అసెంబ్లీలో బిగ్‌ఫైట్: బాబు కిరణ్ వాగ్వాదం, సబిత ఫైర్

kiran - chandrababu
హైదరాబాద్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అవినీతిపై చంద్రబాబు ప్రసంగిస్తూ మంత్రులపై ఆరోపణలు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికి సిఎం అవినీతిలో కూరుకుపోయింది చంద్రబాబేనని, ఆయన కేసు కోర్టులో ఉందని, అక్కడ తాను అవినీతిపరుడిని కాదని సమాధానం చెప్పుకున్న తర్వాత వచ్చి అవినీతిపై మాట్లాడాలని సూచించారు. మొదట అవినీతిపై నీ సంజాయిషీ కోర్టులో చెప్పుకొని ఆ తర్వాత వచ్చి మాట్లాడాలని బాబుకు సూచించారు. అందుకు బాబు మాట్లాడుతూ మీ మంత్రులకు అవినీతిపై నీతులు చెప్పండని సిఎం వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. అవినీతిపై నేను ఏ చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. అంత ఈజీగా ఎవరినీ వదిలేది లేదని, తాను తొమ్మిదేళ్లు నీతి నిజాయితీలతో రాష్ట్రాన్ని పాలించానని చెప్పారు. కోర్టులు కేసులు అని భయపడితే భయపడే సమస్యే లేదన్నారు. హోం మినిస్టర్ సబితా ఇంద్రా రెడ్డి పైనే అవినీతి ఆరోపణలు వచ్చాయని చెప్పారు.

వెంటనే సబిత లేచి తనపై ఆరోపణలు చేస్తే రుజువు చేయాల్సిన అవసరం ఉందని బాబుకు సమాధానం చెప్పారు. రాజకీయాల్లో విలువలు పెంచేలా మనం ప్రవర్తించాలని ఇలా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదని వారి వద్ద ఆధారాలు ఉంటే సంతకం పెట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా కుటుంబం, బంధువులపై ఏ విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. ఆ తర్వాత సిఎం ప్రజల విశ్వాసం ఉంది కాబట్టే ఇక్కడ కూర్చున్నామన్నారు. కుర్చీ లాక్కుంటే వచ్చేది కాదని, పిల్లనిచ్చిన మామను మోసం చేసి సిఎంను కాలేదని, వెన్నుపోటు పొడిచి అధికారం వస్తే తాను ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్ని వదిలేసే వాడినన్నారు. సాయం చేసిన కాంగ్రెసును, మాను, ప్రజలను బాబు మోసం చేశారన్నారు. కాంగ్రెసు వల్లే నీవు ఓ లీడర్ అయ్యావన్నారు. తన తండ్రి హయాం నుండి తాము కాంగ్రెసు పార్టీలో ఉన్నందువల్లే తనను సిఎం పదవి వరించిందన్నారు.

అందుకు చంద్రబాబు ఘాటుగా సమాధానం చెప్పారు. మీరు విశ్వాసం కోల్పోయారు కాబట్టే మేం అవిశ్వాసం ప్రవేశ పెట్టామని, అడ్డదారిలో అధికారం కావాలని కోరుకోవటం లేదని ప్రజలు కోరుకున్నప్పుడు వస్తామని చెప్పారు. ఢిల్లీ దయాదాక్షిణ్యాల మీద పదవి దక్కించుకున్నదెవరో తెలుసునన్నారు. మాకు హైకమాండ్ ప్రజలు అయితే మీకు ఢిల్లీ, సోనియా అని విమర్శించారు. కిరణ్ జాక్ పాట్ సిఎం అని, వెన్నెముక లేని ప్రభుత్వమని, సోనియా కాళ్లు పట్టుకొని సిఎం అయ్యారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. దివంగత వైయస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని, జలయజ్ఞానాన్ని ధనయజ్ఞంగా మార్చారని, వైయస్ అవినీతిపై అప్పుడే రాజా ఆఫ్ కరెప్షన్ పేరుతో ఓ పుస్తకాన్ని వేశామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+