తెలుగు తమ్ముళ్లపై బొత్స ఫైర్, నేర్చుకోండని సూచన

ప్రభుత్వం ఏమీ చేయలేదని అనడం సరి కాదని ఆయన అన్నారు. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని రాజీవ్ యువకిరణాలను ప్రారంభించామని, తాము ఆ హామీని నిలబెట్డుకోలేనప్పుడు మాట్లాడవచ్చునని ఆయన అన్నారు. తెలుగుదేశం విధానాలను ప్రజలు తిరస్కరించారని, అందుకే ఆ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయాలని, ఈ విషయాన్ని తెలుగుదేశం సభ్యులు నేర్చుకోవాలని ఆయన అన్నారు. నాగలి పట్టనివారు ఈ రోజు రైతు పోరు బాట చేపడుతున్నారని మంత్రి దానం నాగేందర్ చంద్రబాబును
ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications