అలక వీడిన చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డికే పిఆర్పీ ఓటు

సీఎం కిరణ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి ఆజాద్ మరోసారి చిరంజీవికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఈ సమయంలో ఢిల్లీ నుంచి అహ్మద్ పటేల్ మంతనాలు జరిపి, పరిస్థితిని చక్కదిద్దారు. బొత్సతో మాట్లాడినప్పుడు తమ ఎమ్మెల్యేలకు తగిన గౌరవం, ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తిని చిరంజీవి మరోసారి బయటపెట్టారు. విలీనం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారినా.. వారికి గౌరవమర్యాదలు లభించడంలేదు'' చెప్పారు. ఇక మీదట వివక్ష ఉండదని పటేల్ చెప్పారు. పీఆర్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమానంగా చూస్తారని, రెండువారాల్లో ఫలితా లు కనిపిస్తాయని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
"ప్రభుతాన్ని పడగొట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నప్పుడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజల తీర్పునకు కట్టుబడి ప్రభుత్వానికి అండగా నిలిచాం. మా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వాస్తవమే. దానికి కారణం ప్రభుత్వమే. వారి నియోజకవర్గాల్లో చిన్నచిన్న పనులూ చేయకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. అహ్మద్‌పటేల్, ఆజాద్, సీఎం ఫోన్‌చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమానంగా చూస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. మా మధ్య పొరపొచ్చాలను ఆసరా చేసుకొని కొన్ని అసాంఘిక శక్తులు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారి ఆటలు సాగకుండా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తాం'' అని ప్రకటించారు. ప్రజా రాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వారే ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారని పీసీసీ అధ్యక్షుడు బొత్స ప్రకటించారు.












Click it and Unblock the Notifications