నేను ఒక్కడినే, కానీ నా వెనక కోటి మంది: జూలకంటి

Julakanti Ranga Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి అనే ముళ్ల కిరీటాన్ని కాంగ్రెసు అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి పెట్టిందని సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటూ ఆయన సోమవారం సాయంత్రం ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిది తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతమని అంటున్నారని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది నాలుగు కళ్ల సిద్ధాంతమని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీది ఒకే సిద్ధాంతమని ఆయన అన్నారు. కాంగ్రెసు అవకాశవాద విధానం వల్లనే రాష్ట్రంలో ఈ అనిశ్చితి ఏర్పడిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని ఆయన అన్నారు. ఈ సమయంలో మంత్రి డి. శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని - పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం అడ్రస్ లేకుండా పోయిందని, అలాగే మాట్లాడండి అక్కడే ఉంటారని ఆయన రంగారెడ్డి అన్నారు. తమ సిద్ధాంతాలకు విరుద్ధమైన పార్టీకి మద్దతిస్తున్నారని, ఎన్నికలు వస్తే గెలుస్తామనే ఆ విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు మాట్లాడితే గాలి మాటలు మాట్లాడుతారని అందరికీ తెలుసునని, సిపిఎం సభ్యుడు పద్ధతిగా మాట్లాడుతారని అనుకున్నామని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి సలహాదారు మాదిరిగా రంగారెడ్డి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఏం మాట్లాడాలో రాసివ్వండని జూలకంటి రంగారెడ్డి మంత్రులను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు స్పష్టమైన వైఖరి తీసుకుని అనిశ్చితిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. స్పష్టమైన వైఖరి తీసుకోలేని స్థితిలో కాంగ్రెసు ఉందని ఆయన అన్నారు. తన ఆరోపణలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఆయన కాంగ్రెసుకు సవాల్ విసిరారు. సభలో తాను ఒక్కడినే ఉండవచ్చు గానీ తన వెనక కోటి మంది వామపక్షవాదులు ఉన్నారని ఆయన అన్నారు. కరువు సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+