రామోజీ రావు పిటిషన్‌పై హైకోర్టు విచారణ ప్రారంభం

ప్రస్తుతం తాము ప్రాథమిక విచారణకు మాత్రమే ఆదేశించామని, ఆరోపణలు ఎదుర్కున్నవారిపై వారి విచారణకు గతంలో ఆదేశించిన సందర్భాలు ఉన్నాయని, అదే రీతిలో ఇప్పుడు ఆదేశాలు ఇచ్చామని హైకోర్టు బెంచ్ తెలిపింది. ప్రాథమిక విచారణలో తేలిన అంశాలను బట్టి నోటీసులు జారీ చేసి మీ వాదన కూడా వింటామని కోర్టు తెలిపింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు చంద్రబాబుతో సహా 13 మందిపై విచారణ జరపాలని సిబిఐని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, డిజిపి, హోంశాఖ కార్యదర్శులను ఆదేశించిన విషయం తెలిసిందే.
రామోజీ రావు వెకేట్ పిటిషన్‌పై హైకోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. తమ వాదనలు వినకుండా ప్రాథమిక విచారణకు ఆదేశించడం సరి కాదని రామోజీ రావు తరఫు న్యాయవాది అన్నారు. తమకు తమ వాదనలు వినిుపించే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత నోటీసులు ఇవ్వవచ్చు కదా అని న్యాయమూర్తి అడిగారు. ప్రతివాదులను నిందితులుగా పేర్కోనడం లేదని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున ప్రాథమిక విచారణను కొనసాగనివ్వాలని వైయస్ విజయమ్మ తరఫు న్యాయవాది కోరారు. విచారణకు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని కోరారు.












Click it and Unblock the Notifications