నా తండ్రి పెట్టిన భిక్ష: కిరణ్, చిత్తుగా ఓడించా: బాబు

చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా ప్రజాసేవ చేశారని, వారిపై ఇటువంటి ఆరోపణలు రాలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తమ్ముళ్లు, కుమారులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అలా పాల్గొనడానికి ఇది రాచకరికం కాదని ఆయన అన్నారు. దీనికి ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందిస్తూ తమ ఓటర్లు మంచివారు కాబట్టి చంద్రబాబును కుప్పంలో గెలిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు.
ప్రతిపక్ష నాయకుడినైన తనను ముఖ్యమంత్రి ఏకవచనంతో సంబోధిస్తున్నారని, ఇది సభామర్యాద కాదని, హుందాతనం కాదని చంద్రబాబు అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ - తాను ఏకవచన ప్రయోగం చేసి ఉంటే తప్పేనని, ఆ విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని అన్నారు. చంద్రబాబుకు తన తండ్రి పేరును ప్రస్తావించే అర్హత లేదని, తన తండ్రి పెట్టిన భిక్ష వల్లనే చంద్రబాబు శాసనసభలో ఉన్నారని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ- తాను ముఖ్యమంత్రి తండ్రిని చిత్తుగా ఓడించానని అన్నారు.












Click it and Unblock the Notifications