జగన్ వర్గం ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకున్నారు: అంబటి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేకున్నా, రైతుల పేరు చెప్పి జగన్‌కు బలం లేదని చెప్పడానికి అవిశ్వాసాన్ని ప్రతిపాదించారని తెలిసినా రైతుల పట్ల చిత్తశుద్ధితో తమ శానససభ్యులు సహకరించారని ఆయన అన్నారు. తమ శాసనసభ్యులు 18 పట్ల రైతుల కోసం నిలబడ్డారని ఆయన అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన శాసనసభ్యులు వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతించాలని, వైయస్ జగన్ ఆదేశాలను పాటించారని ఆయన అన్నారు. పదవులను గడ్డిపోచతో సమానంగా పరిగణించి రైతుల కోసం నిలబడ్డారని ఆయన అన్నారు.
అవిశ్వాసంతో కాంగ్రెసు బలం తగ్గిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు 148 మంది సభ్యులు ఉండగా ఆ బలం 136కు తగ్గిందని ఆయన అన్నారు. నైతికంగా ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్నది కాంగ్రెసు ప్రభుత్వం కాదని, మిశ్రమ ప్రభుత్వమని, ప్రజారాజ్యం, మజ్లీస్, ఇండిపెండెంట్ సభ్యుల సహకారంలో కాంగ్రెసు అవిశ్వాసాన్ని ఓడించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications