హైదరాబాద్: పార్టీ విప్ ధిక్కరించి తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెసు మీనమేషాలు లెక్కిస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆదివారం ధ్వజమెత్తారు. చర్యలు తీసుకోవడానికి వెనకాడుతుండటంతో వారు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమవుతోందన్నారు. ముఖ్యమంత్రి ఎంత బలహీనురో తెలుస్తోందన్నారు. పదే పదే సిఎంని ఢిల్లీకి పిలిపించుకోవడం ఆ పదవికి ఉన్న హోదాను కేంద్రం చిన్నచూపు చూడటమేనని విమర్శించారు.
అవిశ్వాస తీర్మానం గెలిచామన్న సంతోషం కన్నా ఉప ఎన్నికల్లో ఎలా గెలవాలో తెలియక కాంగ్రెసు భయపడుతోందన్నారు. రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.