అనర్హత: జగన్‌వర్గం ఎమ్మెల్సీల వంతు, ఢిల్లీకి బొత్స

జగన్ వర్గంలో ఉన్న కొండా మురళీ, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి, ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులపై అనర్హత పిటిషన్ చైర్మన్‌కు ఇవ్వనున్నారు. ఉదయం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునే అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యేలపై మంగళవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశముంది. మరోవైపు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications