వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా హజారే దీక్ష: రాహుల్‌ను టార్గెట్ చేసిన కేస్రీవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ అన్నా హజారే బృందం సభ్యుడు కేస్రీవాల్ ఆదివారం మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం బలహీన నివేదిక ఇచ్చిందని ఆరోపిస్తూ ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కేస్రీవాల్ మాట్లాడారు. రాహుల్ కనుసన్నుల్లోనే లోక్ పాల్ పిల్లుపై ప్రభుత్వ నిర్ణయం జరిగిందని ఆరోపించారు. లోక్ పాల్‌పై పార్లమెంటు తీర్మానాన్ని స్టాండింగ్ కమిటీ తోసిపుచ్చి, రాహుల్ సూచనల్ని ఆమోదించిందని ఆరోపించారు. లోక్ పాల్ బిల్లుపై ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పార్లమెంటు సభ్యులు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. యుపిఐ ప్రభుత్వం తమని మోసగించిందన్నారు.

అన్నా మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు. అందరూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. లోక్ పాల్ బిల్లుపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతల్ని హజారే ఆహ్వానించారు. ఈ చర్చలో బిజెపి నేత అరుణ్ జైట్లీ, జెడి నేత శరద్ యాదవ్, సిపిఎం నేత బృందాకారత్, టిడిపి తరఫున ఎర్నన్నాయుడు పాల్గొన్నారు. కాగా హజారే దీక్షపై కాంగ్రెసు పార్టీ స్పందించింది. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటులోనే చట్టాలు రూపొందుతాయని జంతర్ మంతర్ వద్ద కావని విమర్శించింది. బిజెపి మద్దతుతోనే అన్నా ఉద్యమం నడుస్తోందని ఆరోపించింది. ఇబ్బంది పెట్టేందుకే ఉద్యమం నడుపుతున్నారని, లోక్ పాల్ బిల్లును అఢ్డు పెట్టుకొని హజారే రాజకీయం చేస్తున్నారన్నది.

English summary
Anna Hazare started his fast at Janthar Manthar today for lokpal bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X