ఫిబ్రవరిలో కేంద్ర మంత్రివర్గంలోకి చిరంజీవి?

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడిన చిరంజీవికి సముచిత స్థానం కల్పించే విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆయనకు తగిన స్థానం కల్పించే విషయంలో జాప్యం జరుగుతూనే ఉన్నది. ఈ స్థితిలోనే చిరంజీవి అలకబూనినట్లు చెబుతున్నారు. ఆయన వర్గం శానససభ్యులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు నెలల్లో చిరంజీవికి, ఆయన వర్గానికి తగిన స్థానాలు కల్పించే విషయంపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications