చిరుకు సముచిత స్థానం, జగన్ వర్గంపై వేటు: బొత్స

చిరంజీవి వర్గం అసంతృప్తి వెనుక తాను ఉన్నానన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు కొన్ని పార్టీలకు చెందినవిగా మన రాష్టంలో ఉన్నాయని అది దురదృష్టకరమని దానివల్లే ఇలాంటి అవాస్తవ ప్రచారం జరుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అవిశ్వాసం పెట్టారని విమర్శించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలని ఆయన భావిస్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. పార్టీ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయమని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పార్టీ పరంగా త్వరలో నోటీసులు పంపిస్తామన్నారు.
సంస్థాగతంగా జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు. ఉప ఎన్నికలకు అభ్యర్థుల్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటకు వెళ్లడం బాధాకరమే అని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను పలు అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు.












Click it and Unblock the Notifications