పార్టీ నిర్మాణంపై జగన్ దృష్టి, ఉప ఎన్నికలే టార్గెట్

ఉప ఎన్నికలు మరెంతో దూరం లేనందున తన తదుపరి ఓదార్పు యాత్రను ఆయా జిల్లాల్లో నిర్వహించనున్నారని సమాచారం. తద్వారా ఓదార్పు యాత్ర కొనసాగడంతో పాటు ఎన్నికల ప్రకటన వచ్చే వరకు ఆయా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నారట. శుక్రవారంతో గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ముగించుకొని ఆయన సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. శనివారం సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులతో, ఆదివారం తన వర్గం ఎమ్మెల్యేలతో జగన్ భేటీ కానున్నారు.
ఉప ఎన్నికలు, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు. 19 తర్వాత రెండు రోజులు పార్లమెంటు సమావేశాలలో హాజరవనున్నారు. ఆ తర్వాత నెలాఖరు నుండి ఉప ఎన్నికలు జరగబోయే మరో జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications