వైయస్ జగన్ ఎమ్మెల్యేలకు కిరణ్ కుమార్ రెడ్డి చిక్కులు

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది కాంగ్రెసు తిరుగుబాటు శాసనసభ్యులకు చుక్కలు చూపించాలనే వ్యూహరచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. పార్టీ విప్‌ను ధిక్కరించి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన ఆ 16 మందికి చిక్కులు కల్పించి, వారి వారి నియోజకవర్గాల్లో ఉనికిని ప్రశ్నార్థకం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలు వచ్చేనాటికి వారికి నియోజకవర్గాల్లో స్థానం లేకుండా, ప్రజల్లో వారికి ఆదరణ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకు కదులుతున్నట్లు సమాచారం. దానివల్లనే వారిపై వేటు వేసే విషయంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. వారిని ఎదుర్కోవడానికి అనువైన వ్యూహాన్ని రూపొందించుకున్న తర్వాత వారిపై వేటుకు తగిన ఏర్పాట్లు చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

తన వ్యూహంలో భాగంగానే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు బ్రేక్ వేయాలని అనుకుంటున్నారు. తమ శాసనసభ్యులు వైయస్ జగన్ వైపు వెళ్లడం వల్ల తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతుందనే అభిప్రాయం ప్రజల్లో కలిగించడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో వారిని గెలిపిస్తే తమ నియోజకవర్గాలకు ఏ విధమైన ప్రయోజనమూ చేకూరదని, అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తేనే ఫలితం ఉంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆ నియోజకవర్గాల్లో తమ పార్టీ నాయకులకు అభివృద్ధి పనులు అప్పగించాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాలకు ముందుగానే పార్టీ అభ్యర్థులను గుర్తించి, నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

మరో వైపు, ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి మంత్రులు, పార్టీ శ్రేణులతో కలిపి ఓ జట్టును ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. కిందిస్థాయి నాయకత్వానికి తగిన భాగస్వామ్యం కల్పిస్తూ ఈ జట్ల ఏర్పాటు జరుగుతుందని అంటున్నారు. వారిపై అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యతను మోపుతారని అంటున్నారు. తద్వారా వైయస్ జగన్ శాసనసభ్యుల విజయావకాశాలను దెబ్బ తీయాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+