కత్తులు దూసుకుంటున్న కిరణ్, బొత్స? ఫిర్యాదులు

ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానం సమయంలో వారి మధ్య మరింత దూరం పెరిగిందట. అవిశ్వాసానికి ముందు చిరంజీవి వర్గం అలక వెనుక బొత్స ఉన్నారనే అనుమానం కిరణ్‌లో ఉందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలతో కిరణ్ సఖ్యత పెంచుకునే ప్రయత్నం చేయగా, బొత్స మాత్రం ఎమ్మెల్యేలు కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి రావాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో వారు వెనక్కి తగ్గారనే వాదనలు ఉన్నాయి. మరోవైపు సిఎం మంత్రివర్గ విస్తరణ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా బొత్స పిఆర్పీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట.
ఇలా మంత్రివర్గ విస్తరణ సమయంలో ప్రారంభమైన బొత్స - కిరణ్ విభేదాలు అవిశ్వాసం సమయానికి తారాస్థాయికి చేరాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పిసిసి చీఫ్, సిఎం మధ్య ఇలాగే విభేదాలు ఉంటే పార్టీకి నష్టం కలిగిస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications