దీక్ష విరమించిన మాజీ డిఎస్పీ తెలంగాణ నళిని

ప్రస్తుత స్థితిలో దీక్ష కొనసాగించడం మంచిది కాదని ప్రకాష్ జవదేకర్ సూచించి, ఆమె చేత దీక్ష విరమింపజేశారు. తనను సీమాంధ్ర అధికారులు వేధిస్తున్నారని నళిని గతంలో విమర్శలు చేశారు. తాను తెలంగాణకు చెందడం వల్లనే వేధింపులకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసి నిబంధనలను ఉల్లంఘించినందుకు డిఎస్పీ పదవి నుంచి డిజిపి దినేష్ రెడ్డి ఆమెను సస్పెండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ఎనిమిది రోజుల క్రితం ఆమె ఢిల్లీలో దీక్ష చేపట్టారు.












Click it and Unblock the Notifications