ఫామ్ హౌస్‌లో కెసిఆర్ ఏం చేస్తున్నారు?: జోరుగా చర్చ

ఉద్యమంపై వ్యూహరచన చేసే కెసిఆర్ తన ఫామ్ హౌస్‌లో ఉంటూ ఇప్పుడు తన తోటలో ఏ కూరగాయలు పండించాలా? అని ఆలోచిస్తున్నారట. అంతేకాదు ఇదే విషయాన్ని పార్టీ నేతల వద్ద కూడా ప్రస్తావిస్తున్నారట. పంట గురించి ఆలోచిస్తూనే మరోవైపు కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చలు కూడా జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక నుండి ఉద్యమంతో పాటు వారానికి ఒక్క రోజైనా ఫామ్ హౌస్‌లో ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నారట. కెసిఆర్‌లోని మార్పు చూసి పార్టీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.
కెసిఆర్ ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవడంపై తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టి కెసిఆర్ ఇప్పుడు తోటల్లో తిరుగుతున్నారని వారు విమర్శిస్తున్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ విశ్రాంతి వెనుక ఢిల్లీ సందేశ ప్రభావం ఏమైనా ఉందా? అనే చర్చ జోరుగా జరుగుతోంది.












Click it and Unblock the Notifications