తెలంగాణకు వ్యతిరేకిని కాను, పరిమితులంతే: బాబు

మహబూబ్‌నగర్ శాసనసభా స్థానానికి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్ పేరును ఖరారు చేశారు. స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి అకాల మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. రాష్ట్రంలో పెద్ద యెత్తున ఉప ఎన్నికలు వస్తుండడంతో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై చాలా త్వరగా కసరత్తు ప్రారంభించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఒకటి రెండు రోజులుండగా అభ్యర్థులను ఖరారు చేసే తన సహజ సంప్రదాయానికి భిన్నంగా ఆయన ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కసరత్తు చేస్తున్నారు. నాయకుల మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నారు. ఉప ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మిగతా పార్టీలు అభ్యర్థులు ఖరారు చేసేలోగానే ప్రచారంలోకి దిగి ఓటర్లను తమ వైపు లాక్కోవాలనే ఎత్తుగడతో ఆయన వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications