కేంద్ర మంత్రివర్గంలోకి అజిత్ సింగ్, 18న విస్తరణ

కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని ఆర్ఎల్‌డి రాష్ట్రంలోని మొత్తం 403 సీట్లలో 45 శాసనసభ సీట్లకు పోటీ చేసే ఆలోచనలో ఉంది. రాహుల్ గాంధీ వ్యూహం మేరకు ఉత్తరప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెసును బలోపేతం చేయడానికి అజిత్ సింగ్‌తో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. అజిత్ సింగ్ కేంద్ర మంత్రి పదవిని చేపట్టడం ఇది నాలుగోసారి. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిరంజీవికి ఇదే సమయంలో మంత్రి పదవి ఇస్తారా, లేదా అనేది సందేహంగానే ఉంది. తృణమూల్ కాంగ్రెసు, డిఎంకెల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి లభించవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, అజిత్ సింగ్‌తోనే మంత్రివర్గ విస్తరణను సరిపుచ్చవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications