కేర్‌కు శంకరరావు, సబిత హస్తం లేదన్న ఎమ్మెల్యే

P Shankar Rao
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావును నిమ్స్ నుండి కేర్ హాస్పిటల్ తరలించారు. శంకరరావుపై ఉదయం ఎన్టీఆర్ నగర్ వద్ద కొందరు రాళ్లు, గుడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అతనికి బిపి పెరిగి చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం మంత్రిని నిమ్స్ నుండి కేర్‌కు తరలించారు. కాగా శంకరరావుపై దాడిని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఖండించారు. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. దాడి ఎవరు చేసినా ఇటువంటి సంఘటనలు సరికాదన్నారు.

ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు గర్హనీయమని ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాప్రతినిధులపై దాడులు దురదృష్టకరమన్నారు. శంకరరావుపై దాడిలో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి హస్తం లేదని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. మంత్రిపై దాడిని తాను ఖండిస్తున్నానని, అయితే శంకరరావు తీరును అందరూ గమనిస్తున్నారన్నారు. ఆయన వైఖరి గమనించి సహించలేకే కొందరు దుండగులు దాడి చేసి ఉండవచ్చునన్నారు. సబితకు ఇందులో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+