మంత్రి శంకరన్నకు క్షీరాభిషేకం: దళిత ఆత్మగౌరవ సభ

హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనపై దాడి చేయించారని శంకరరావు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సబితా ఇంద్రారెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తుతూ వస్తున్నారు. ఆమెను మంత్రివర్గం నుంతి తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తనపై దాడికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిలే కారణమని ఆయన అంతకు ముందు ఆరోపించారు. వారిద్దరి నుండి తనకు ప్రాణహాని ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిపరులను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. త్వరలో అవినీతి పరుల చిట్టా విప్పుతానని వారందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానని హెచ్చరించారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఐదువేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications