థానే తుఫాను టెన్షన్: సిఎస్‌కు సిఎం కిరణ్ రెడ్డి ఫోన్

రెండు రోజులుగా భయాందోళనలు కలిగిస్తున్న థానే తుఫాను బంగాళాఖాతంలో పెనుతుఫానుగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశలో 350 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను ఉంది. మరో పన్నెండు గంటల్లో ఇది బలపడి తీరం దాటాక బలహీనపడే అవకాశముంది. గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో పలు బోట్లు సముద్రంలో చిక్కుకు పోయాయి. కొన్ని బోట్లు సురక్షితంగా ఉండగా, మరికొన్ని బోట్లను సముద్రంలో వంద నాటికల్ మైళ్ల దూరంలో అధికారులు గుర్తించారు. వీరిని రక్షించడానికి కోస్టుగార్డు అధికారులు రంగంలోకి దిగారు. గుంటూరులో ఓ బోటులో నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తుఫాను చెన్నై - నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది.
కృష్ణా జిల్లా నిడమర్రులో 25 మీటర్లు, అంతర్వేదిలో 30 మీటర్ల చొప్పున సముద్రం ముందుకు వచ్చింది. తీరప్రాంతాల్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో తుఫాను సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాకినాడ - ఉప్పాడ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications