కీలక దశకు ఉద్యమం: కెసిఆర్ నోటి నుండి అదే పాట

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ముందు ముందు ఉద్యమం భయంకరంగా ఉంటుందన్నారు. కేంద్రం ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవించడం లేదన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం కావాలన్నారు. తెలంగాణ ఇప్పుడు సాధించుకోకుంటే కట్టుబానిసలుగా మారాల్సి వస్తుందన్నారు. పదకొండేళ్లుగా సహనంతో ఉద్యమిస్తున్నామని, రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యమన్నారు. కాగా పలువురు కాంగ్రెసు, టిడిపి కార్యకర్తలు కెసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications