వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌కు ఝలక్: విస్తరణకు బ్రేక్, తెలంగాణపై చర్చ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

kiran kumar reddy - ghulam nabi azad
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విస్తరణ ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లినట్లుగా స్పష్టమైంది. సిఎం, కేంద్ర మంత్రులు, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లు శుక్రవారం ఉదయం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి నేరుగా ఎపి భవన్‌కు వెళ్లారు. సిఎం అనంతరం బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్, పటేల్‌లను విస్తరణపై ప్రశ్నిస్తే ఆ అంశంపై చర్చ జరగలేదని తేల్చి చెప్పారు. కెబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని తేల్చి చెప్పిన వారు ఏ అంశంపై చర్చ జరిగిందో మాత్రం పెదవి విప్పలేదు. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ అంశంపై చర్చ జరిగినట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కేంద్ర హోంమంత్రి చిదంబరం జనవరిలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు ఒక్క నియోజకవర్గం మినహా తెలంగాణలో జరుగుతున్నందున చిదంబరం వ్యాఖ్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో ఆల్ పార్టీ మీటింగ్, తెలంగాణ అంశంపై ప్రజలు ప్రశ్నించే అవకాశముంది కాబట్టి ఆల్ మీటింగ్ ఏర్పాటు చేయాలా, ఉప ఎన్నికల్లో ఏం చెప్పాలి అనే అంశంపై చర్చించినట్లు సమాచారం. సోనియాతో భేటీ అనంతరం సిఎం చిదంబరంతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అంశంపైనే ప్రధానంగా చర్చించారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

English summary
It seems, CM Kiran Kumar Reddy talk about Telangana issue with Sonia Gandhi. Azad and Ahmed condemned talks about reshuffle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X