హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిల వస్త్రధారణపై డిజిపి దినేష్ రెడ్డి కామెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dinesh Reddy
హైదరాబాద్: అమ్మాయిల వస్త్రధారణపై రాష్ట్ర డిజిపి(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన డిజిపి కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలోని పలు నేరాల వివరాలు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిల వేషధారణ వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వేషధారణ కృతకంగా ఉండకూడదన్నారు. వారి వేషధారణ కూడా అత్యాచారాలకు కారణమవుతుందన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో గ్రామాల్లో కూడా సల్వార్ కమీజ్‌లు వేసుకుంటున్నారన్నారు. లిక్కర్, సినిమా, డబ్బు తదితరాల కారణంగా అమ్మాయిల ఫ్యాషన్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. అలాంటి డ్రెస్‌లు వేసుకుంటే కష్టమన్నారు.

కాగా అమ్మాయిల వస్త్రధారణపై డిజిపి దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పలువురు మహిళా నేతలు తప్పు పట్టారు. అమ్మాయిలు పూర్తిగా డ్రెస్ చేసుకుంటే తప్పకుండా రక్షించగలరా అని ప్రశ్నించారు. అత్యాచార సంఘటనలకు, వస్త్రధారణకు లింక్ పెట్టడం సరికాదన్నారు. డిజిపి మాట్లాడిన పద్ధతిలోనే మగవాళ్లు చాలామంది ఆలోచిస్తున్నారన్నారు. కాగా డిజిపి అమ్మాయిల వేషధారణపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని డిజిపి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వేషధారణ కూడా ఒక కారణమని మాత్రమే చెప్పారన్నారు.

English summary
DGP Dinesh Reddy make controversial comments against girls dressing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X