మైక్రోవేవ్ ఓవెన్ల ఆహారం వినియోగిస్తున్నారా..?

మైక్రోవేవ్ ఓవెన్. ఎక్కువ ఇళ్లల్లో కనిపిస్తోంది. ఆహారాన్ని కొన్ని క్షణాల్లో వేడివేడిగా ప్రిపేర్ చేస్తుంది. వంట సమయాన్ని తగ్గించి సగం శ్రమని దూరం చేస్తుంది. అందుకే, ఇప్పుడు చాలా మంది మైక్రోవేవ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, త్వరగా అయిపోతుంది కదా అని ఏది పడితే అది మైక్రోవేవ్‌లో పెట్టొద్దొని చెబుతున్నారు నిపుణులు. మైక్రోవేవ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. దీనికి సంబంధించి నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

ప్రస్తుత కాలంలో ఎక్కవమంది మైక్రోఓవెన్లు ఎక్కువమంది వాడుతున్నారు. మైక్రోవేవ్‌లు నాన్ అయోలైజన్ రేడియేషన్ ద్వారా పనిచేస్తాయి. తినే పదార్థాలను మైక్రోవేవ్‌లో పెట్టడం వల్ల అది కాస్త హైప్రీక్వెన్సీ హీట్ వేవ్స్ మధ్య ఉంటాయి. పదార్థాలను రేడియేషన్‌కు గురయ్యేలా చేసే అవకాశం ఉంటుందనే చర్చ ఉంది. ఒక్క మైక్రో వేవ్ 2.45 బిలియన్ హెట్‌ను కలిగి ఉంటుంద ని లెక్కలు చెబుతున్నాయి. మైక్రో ఒవెన్‌లో ఆహార పదార్థాలను వండటం, లేదా వేడి చేయడం చాలా సులభం. సమయాన్ని ఆదా చేయడంతో పాటు, ఫుడ్‌ను వెంటనే వేడివేడిగా తినే సౌకర్యాన్ని ఇది అందిస్తుంది. అయితే, వండిన ఆహారాలను మళ్లీ మైక్రోవేవ్‌లో వేడి చేయడం వలన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, కొన్ని రకాల కూరగాయల విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం.

షర్మిల కు రాజ్యసభ సీటు ఖరారు వేళ బిగ్ ట్విస్ట్, ఆయన ఎంట్రీతో..!!
షర్మిల కు రాజ్యసభ సీటు ఖరారు వేళ బిగ్ ట్విస్ట్, ఆయన ఎంట్రీతో..!!
microwaves-heat-food-evenly-preserving-taste-and-nutritional-value-but-overcooking-or-using-improp

ప్రయోజనాలు... జాగ్రత్తలు

వండిన ఆహారాల విషయంలో జాగ్రత్త..వండిన తర్వాత చల్లబడిన అన్నాన్ని మైక్రోవేవ్‌లో ఎప్పుడూ వేడి చేయకూడదు. మైక్రోవేవ్ వేడి తగిలినప్పుడు, అన్నంలో పెరిగే బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా విడుదల చేసే విషపదార్థాల కారణంగా అన్నం విషతుల్యంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు. వండిన లేదా తాజా మాంసం, అలాగే గుడ్లను మైక్రో ఒవెన్‌లో వేడి చేసినప్పుడు వాటి ప్రోటీన్ విలువలు తగ్గిపోతాయి. మాంసంలోని ప్రోటీన్ల నిర్మాణంలో మార్పులు వచ్చి, అవి జీర్ణం కావడానికి కష్టంగా మారతాయి. కొన్ని సందర్భాల్లో, ఇది కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముంది. సాధారణంగా వండిన కూరల్ని మైక్రోవేవ్‌ లో వేడి చేస్తారు. ఇలా చేయడం వలన కూరల్లోని విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి వంటి పోషకాలు తగ్గిపోయి, అవి పోషక విలువ లేని ఆహారంగా మారతాయి. మైక్రో వేవ్ ఓవెన్ లో ఆహార పదార్థాలను ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. నీటిని వేడి చేసేందుకు కూడా కొంతమంది మైక్రోఓవెన్‌ ని ఉపయోగిస్తుంటారు. కానీ, ఇది సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+