కెసిఆర్ పూర్వీకుల ఇల్లు విజయనగరం జిల్లాలోనే

K Chandrasekhar Rao
విజయనగరం: తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుది తెలంగాణ కాదు, ఆంధ్ర ప్రాంతంలోని విజయనగరం జిల్లా అని నిరూపించడానికి తెలుగుదేశం ఆంధ్ర నాయకులు ప్రయత్నాలు చేశారు. ఇందుకు వారు ఓ మీడియా ప్రతినిధలు బృందాన్ని విజయనగరం జిల్లా బుడ్డిపేటకు తీసుకుని వెళ్లారు. కెసిఆర్‌ది విజయనగరం జిల్లా అని, ఆయన తెలంగాణవారు కాదని తెలుగుదేశం తెలంగాణ నాయకులు చెబుతున్న విషయాన్ని రుజువు చేయడానికి ఆంధ్ర ప్రాంత నాయకులు శుక్రవారం ఈ ప్రయత్నం చేశారు. కెసిఆర్ పూర్వీకులది తమ ఊరేనని బుడ్డిపేట గ్రామ ప్రజలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

"ప్రత్యేక తెలంగాణవాదంతో రాష్ట్రాన్ని విభజించేందుకు పోరాడుతున్న కేసీఆర్ తన స్వగ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలి. కేసీఆర్ తాత వెంకట్రావు, ముత్తాత రామారావు మా ఊరిలోనే ఉండేవారు. కేసీఆర్ తాత చిన్నతనంలోనే వారి కుటుంబం ఇక్కడి నుంచి తెలంగాణకు వలస వెళ్లింది. ఇక్కడి నుంచి వలసవెళ్లి సొంత గడ్డకే అన్యాయం చేస్తున్నారు'' అని గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేసినట్లు శనివారం వార్తలు వచ్చాయి. కేసీఆర్ తాత, ముత్తాతలు నివసించిన ఇంటి ఆనవాళ్లను 70 ఏళ్ల వయసున్న ములగశర్ల సత్యనారాయణ చూపించారు. "మాది కేసీఆర్ సామాజిక వర్గమే.కేసీఆర్ పూర్వీకులు నివసించిన ఇంటిని 30 ఏళ్ల కిందట కొనుగోలు చేశాం. అప్పట్లో కల్వకుంట్ల వారి కుటుంబం ఒక్కటే ఉండేది. కరువు కాటకాలు అధికంగా ఉండడంవల్ల వారి కుటుంబం తెలంగాణకు వలస వెళ్లిపోయింది'' అని సత్యనారాయణ వివరించినట్లు వార్తలు వచ్చాయి. కేసీఆర్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న పొట్లపల్లి సుబ్బారావు అనే వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గరల్లోని కడకట్ల గ్రామం వలస వెళ్లిపోయారని, కేసీఆర్ పూర్వీకుల గురించి ఆయన పూర్తి వివరాలు అందించే అవకాశముందని స్థానికులు తెలిపారని వార్తపత్రికలు రాశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+