హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్తీసారా అంశంపై చిరంజీవి గరం గరం: సిఎంకు లేఖాస్త్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి సోమవారం లేఖ రాశారు. కల్తీసారా తాగి మృతి చెందిన ఘటనపై చిరంజీవి ప్రభుత్వంపై గరం గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాటు సారా తాగి మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని చిరంజీవి సిఎంకు రాసిన తన లేఖలో పేర్కొన్నారు. బాధితులకు సరైన వైద్యం అందించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఇలాంటి సంఘటనలు కాంగ్రెసు పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతాయని ఆయన అందులో ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మడం వల్లనే సామాన్యులు చీప్ లిక్కర్‌కు అలవాటు పడుతున్నారన్నారు.

ఎక్సైజ్ శాఖ నిర్లిప్తంగా ఉందని విమర్శించారు. మద్యం అమ్మకాలతో ఖజానా పెంచుకోవడం సరికాదన్నారు. మద్యపాన వ్యతిరేక ప్రచారం ప్రభుత్వ బాధ్యత అన్నారు. మద్యపాన నిషేధం ఎత్తి వేసిన బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. మద్యం సిండికేట్లలో ఎంతటి పెద్దవారున్నా కేసులు పెట్టాలన్నారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం మహమ్మారితో గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందన్నారు. కాగా చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్‌కు లేఖ రాయడం ఇదే తొలిసారి.

అయితే చిరంజీవి లేఖాస్త్రం ఆయన వర్గంలో వెల్లువెత్తిన అసమ్మతికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మైలవరం సంఘటన ద్వారా చిరంజీవి సిఎం కిరణ్‌పై పంజా విసిరారని కొందరు భావిస్తున్నారు. ఇటీవల కిరణ్ తన వర్గం నేతలకు మంత్రి పదవులు రాకుండా అడ్డుకున్నందునే చిరు లేఖాస్త్రం సంధించినట్లుగా భావిస్తున్నారు. కాగా మైలవరం బాధితులను చిరంజీవి పరామర్శించే అవకాశం ఉంది. కాగా విజయవాడలోని వెదురుబీడంలో మరో నాటుసారా సంఘటన వెలుగులోకి వచ్చింది. నాటు సారా తాగిన పన్నెండు మంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరికి విషమంగా ఉండటంతో వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

English summary
Tirupati MLA Chiranjeevi wrote a letter to CM Kiran Kumar Reddy about illicit liquor kill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X